ఈ సైట్లు వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ ఖాళీలు ఇట్టే చెప్తాయి...!

3 May, 2021 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని కేంద్రం కూడా భావించగా, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి కనబరచగా,  ఏప్రిల్‌ 28 నుంచి వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా కేంద్రం ప్రకటించడంతో ఆ రోజు ఒక్కసారిగా చాలా మంది సైటుపై పడడంతో  కోవిన్ యాప్‌ రిజిస్ట్రేషన్‌ సైట్‌ క్రాష్‌ అవ్వగా,  ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం చాలా మంది ఎగబడుతున్నారు.

సైట్‌ ఓపెన్‌ చేసిన వెంటనే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ ఖాళీ లేదు అనే సందేశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యకు కొంతమంది టెక్నికల్‌ నిపుణులు పరిష్కారాన్ని చూపారు. వీరు చూపిన పరిష్కారంతో సులువుగా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అందుకుగాను కోవిన్‌ యాప్‌లో వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ ఎక్కడ, ఎప్పుడు ఖాళీగా ఉందో చెప్పేలా వైబ్‌సైట్లను రూపొందించారు. అంతేకాకుండా ఈ సైట్లలో రిజిస్టర్ అయిన వారికి నోటిఫికేషన్‌ అలర్ట్‌లను పంపుతాయి. అందు కోసం ఈ సైట్లలో ముందుగా రిజిస్టర్‌ కావాల్సి ఉంది. నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే తిరిగి కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీంతో ప్రజలు చాలా సమయం పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాడానికి ఈ సైట్లలో రిజిస్టరవ్వండి:

1. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రాకర్‌ ఫర్‌ ఇండియా: దీనిని ఇండియాకు చెందిన అమిత్‌ అగర్వాల్‌ రూపొందించారు. ఈ వైబ్‌సైట్‌లో రిజిస్టర్‌ కాగానే, వ్యాక్సిన్‌ లభ్యత ఎక్కడ ఉందనే విషయం ఈ మెయిల్‌ ద్వారా నోటిఫికేషన్‌ వస్తుంది.


2.అండర్‌45.ఇన్‌(Under45.in):  18-44 సంవత్సరాల వయసు వారికి సమీపంలో ఉన్న టీకాల స్లాట్ల కోసం శోధించడానికి అండర్ 45.in అనే వెబ్‌సైట్‌తో ప్రోగ్రామర్ బెర్టీ థామస్‌ ముందుకు వచ్చారు.

3. గెట్‌జ్యాబ్‌.ఇన్‌(Getjab.in): ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు శ్యామ్ సుందర్, అతని స్నేహితులు getjab.in అనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. ప్రజలకు సమీపంలోని టీకా స్లాట్ల ఖాళీలను ఈ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్‌ వస్తుంది

4. ఫైండ్‌ స్లాట్‌.ఇన్‌(FindSlot.in): కోవిడ్-19 వ్యాక్సిన్‌  అపాయింట్‌మెంట్ కోసం సహాయపడే మరొక సైట్, ఫైండ్‌స్లాట్.ఇన్ , ఈ సైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ కోసం ప్రజలు తమ నగరం ద్వారా లేదా వారి పిన్ కోడ్ ద్వారా శోధించవచ్చును.

చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు