ఆరంభ స్టార్టప్‌ల కోసం 130 మిలియన్‌ డాలర్లు!

25 Jun, 2022 20:29 IST|Sakshi

న్యూఢిల్లీ: వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘ఫండమెంటల్‌ వీసీ’ ఆరంభ స్థాయిలోని స్టార్టప్‌ల కోసం 130 మిలియన్‌ డాలర్లతో (రూ.100 కోట్లు) నిధిని ప్రారంభించినట్టు ప్రకటించింది. కన్జ్యూమర్‌ ఇంటర్నెట్, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, సాస్, గేమింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత స్టార్టప్‌లకు పెట్టుబడులు అందిస్తామని తెలిపింది.

ఈ ఏడాది మార్చిలోనే సెబీ నుంచి ఈ సంస్థకు అనుమతి లభించింది. ఒక్కో స్టార్టప్‌లో ఈ ఫండ్‌ 1.5 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెడుతుంది. వచ్చే రెండేళ్లలో 30 స్టార్టప్‌లకు మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు