త్వరలో హైదరాబాద్‌ వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం..

23 May, 2022 17:28 IST|Sakshi

వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ త్వరలో హైదరాబాద్‌కు వస్తానని, తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై అప్పుడు మాట్లాడుకుందామంటూ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ దావోస్‌కి వెళ్లే ముందు ఇంగ్లండ్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేదాంత గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. వీటిపై చర్చించుకునేందుకు హైదరాబాద్‌ రావాలంటూ అనిల్‌ అగర్వాల్‌ను ఆహ్వానించారు.

కేటీఆర్‌ ఆహ్వానంపై వేదాంత గ్రూపు చైర్మన్‌ స్పందిస్తూ.. ఇండియా గురించి.. ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాల గురించి నీతో చర్చించడం ఎంతో బాగుందంటూ మంత్రి కేటీఆర్‌ను కొనిడాయారు. అంతేకాకుండా త్వరలోనే హైదరాబాద్‌ వస్తానంటూ ట్విటర్‌లో హామీ ఇచ్చారు. 

చదవండి: దావోస్‌లో యంగ్‌ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్‌ మాటామంతి

మరిన్ని వార్తలు