ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్‌, 23.2శాతం పెరిగిన వంట నూనెల ధరలు!

10 Apr, 2022 12:43 IST|Sakshi

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న నల్ల సముద్రం మీదిగా ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. తద్వారా ప్రపంచ ఆహార పదార్ధాల ధరలు మార్చి నెలలో ఆకాశాన్నంటినట్లు  ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) వెల్లడించింది.  

ఎఫ్‌ఏఓ ఆహార ధరల సూచీ మార్చిలో సగటున 159.3 పాయింట్లు నమోదు కాగా ఫిబ్రవరితో పోలిస్తే 12.6శాతం పెరిగింది. 

ఇక ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఎఫ్ఏఓ తృణధాన్యాల ధరల సూచీ 17.1 శాతం అధికంగా ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఫలితంగా గోధుమలు, ఇతర ధాన్యం ధరలు ఎక్కువగా పెరిగాయి.

గత మూడేళ్లలో ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్లు వరుసగా 30 శాతం, 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవుడంతో మార్చి నెలలో ప్రపంచంలో గోధుమ ధరలు 19.7 శాతం పెరిగాయి. ఎగుమతులు ఆగిపోవడంతో యూఎస్‌ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదిలా ఉండగా, మొక్కజొన్న ధరలు నెలవారీగా 19.1 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. బార్లీ, జొన్నలతో పాటు మొక్క జొన్న ధర గరిష్ట రికార్డ్‌ను తాకాయి.

వెజిటబుల్ ఆయిల్ ప్రైస్ ఇండెక్స్ 23.2 శాతం పెరిగింది. పొద్దుతిరుగుడు విత్తన నూనె ఎక్కువగా ధరకే అమ్మకాలు జరుగుతున్నాయి. 

అధిక పొద్దుతిరుగుడు, విత్తన చమురు ధరలు, పెరుగుతున్న ముడి చమురు ధరల ఫలితంగా పామ్, సోయా,రాప్సీడ్ చమురు ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, . ముడి సోయా చమురు ఎగుమతులు తగ్గడంతో   దక్షిణ అమెరికాలో ఆందోళలు మరింత బలపడ్డాయి.  

ఎఫ్ఏఓ చక్కెర ధరల సూచీ ఫిబ్రవరి నుండి 6.7 శాతం పెరిగింది. ఇటీవల పెరిగిన ధర గతేడాది మార్చి కంటే..ఈ ఏడాది 20శాతం ఎక్కువగా పెరిగాయి. విచిత్రంగా భారత్‌లో మాత్రం ఉత్పత్తి అవకాశాలు కారణంగా నెలవారీ ధరల పెరుగుదలను నిరోధించాయి.

మరిన్ని వార్తలు