వాహన విక్రయాలు జూమ్‌

2 Aug, 2022 06:34 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి.

ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది.

మరిన్ని వార్తలు