‘స్క్రాపేజ్‌ పాలసీతో అదనంగా రూ.40వేల కోట్లు’

19 Aug, 2021 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహనాల తుక్కు విధానం (స్క్రాపేజీ పాలసీ) దేశ ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వాహనాల స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించడం కేంద్రం, రాష్ట్రాలకు సైతం అనుకూలిస్తుందంటూ.. జీఎస్‌టీ రూపంలో రూ.40వేల కోట్లను అదనంగా పొందొచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే వాహన స్క్రాపేజీ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు