నిప్పులు గక్కే ఆ గ్రహం! అయినా భూమి తరహాలోనూ అక్కడా..

12 Oct, 2021 14:15 IST|Sakshi

మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్‌ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, 


ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్‌పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు.  పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్‌ మైక్రోఆర్గానిజమ్స్‌(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.  

సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా  గ్రీన్‌ హౌజ్‌ ప్రభావం వల్ల హాట్‌ గ్యాస్‌ బెలూన్‌లా కార్బన్‌ డై యాక్సైడ్‌తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్‌ సెంటిగ్రేడ్‌(863 డిగ్రీల ఫారన్‌హీట్‌) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది.  అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు..  ఫొటోసింథటిక్‌ మైక్రోఆర్గానిజమ్స్‌ పెరిగే అవకాశం ఉందని తేల్చారు.

సోలార్‌ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్‌ ఎనర్జీ పుట్టడం, కాంతి  తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్‌ పిగ్మెంట్స్‌ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాకేష్‌ మొఘల్‌ వెల్లడించారు.  ఆమ్ల, ద్రావణ(వాటర్‌) చర్యల వల్ల మైక్రోబయాల్‌ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్‌లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్‌ అయ్యింది.

చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు