ఈ ఇల్లు చాలా ప్రత్యేకం: అమ్మకానికి బ్రిడ్జ్‌ హౌస్‌.. ధర ఎన్ని కోట్లో తెలుసా?

11 Jun, 2023 15:58 IST|Sakshi

మీరు ఇప్పటివరకూ ఇన్నో రకాల ఇళ్లు చూసి ఉంటారు. ఖరీదైన భవంతుల గురించి విని ఉంటారు. కొండలపై రూ.కోట్లు పెట్టి కట్టిన , విలాసవంతమైన నివాసాల గురించి చదివి ఉంటారు. కానీ ఓ కాలువ బ్రిడ్జిపై నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి తెలుసా?

 

యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజెల్స్‌లోని అల్హంబ్రా వాష్ కాలువకు అడ్డంగా బ్రిడ్జ్‌పై నిర్మించిన ఇల్లు తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు. ఒక పడకగది, ఒక బాత్‌రూమ్ ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని కంపాస్ రియల్ ఎస్టేట్ పోర్టల్ వెబ్‌సైట్‌లో విక్రయానికి ఉంచారు.

 

450 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుక్కునే వారు అందమైన రూఫ్ టాప్ డాబాను ఆనందించవచ్చని, రిటైల్ దుకాణాలు, ఎల్‌ఏ ఫిట్‌నెస్, 99 రాంచ్, మెయిన్ స్ట్రీట్‌లో మంచి ఫుడ్‌స్టాల్స్‌కు సమీపంలో ఉండవచ్చని, ఇది నిజంగా గొప్ప ఆస్తి అని ఇంటిని అమ్మకానికి ఉంచిన పోర్టల్ పేర్కొంది.

లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆహ్లాదకరమైన కాలువ నీటి ప్రవాహానికి ఎదురుగా,  రోడ్డు వంతెన పక్కన ఈ ఇల్లు ఉంటుంది.  ఇంటి డాబా మీదకు వెళ్తే సుందరమైన పరిసరాలను వీక్షించవచ్చు. ఈ ఇల్లు ఒకప్పటి తన హైస్కూల్ స్నేహితుని తల్లిదండ్రులకు చెందినదని దీన్ని అమ్మకానికి ఉంచిన  కంపాస్ ఏజెంట్ డౌగ్ లీ చెప్పారు.

ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌! పరీక్ష రాసి మరీ..

>
మరిన్ని వార్తలు