ప్రముఖ నటుడు కన్నుమూత

6 Dec, 2020 14:03 IST|Sakshi

ముంబై: సినిమా పరిశ్రమలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. సెల‌బ్రిటీలు వ‌రుస మ‌ర‌ణాలు చెందుతుండ‌డంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ టీవీ, సినీ న‌టుడు రవి పట్వర్ధన్(83) నిన్న రాత్రి థానేలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కి నిన్న రాత్రి ఊపిరి ఆడకపోవడంతో ఇటీవ‌ల ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు అని ఆయన పెద్ద కుమారుడు నిరంజన్ పట్వర్ధన్ తెలిపారు. రవి పట్వర్ధన్ కి సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. (చదవండి: రైతులు తల్లిదండ్రులతో సమానం)

1980లలో వచ్చిన హిందీ చిత్రాలైన తేజాబ్, అంకుష్ వంటి చిత్రాలలో నటించాడు. హిందీలో యశ్వంత్(1997), ఆశా అసవ్య సన్(1981), ఉంబార్థ(1982), జంజార్(1987), జ్యోతిబా ఫులే వంటి చిత్రాలలో నటించారు. 250కి పైగా సినిమాల‌లో న‌టించిన ప‌ట్వ‌ర్ధ‌న్ హిందీ, మరాఠీ భాష‌ల‌కు చెందిన టీవీ సీరియ‌ల్స్‌లోను న‌టించారు. అనిల్ కపూర్-మాధురి దీక్షిత్ చిత్రం తేజాబ్ లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా న‌టించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తుజా అహే తుజ్‌పాష్‌లో ఆయ‌న‌ పోషించిన చిరస్మరణీయ పాత్ర  పట్వర్ధన్‌ను ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంద‌ని థానే సంరక్షకుడు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. అతను చివరిసారిగా ప్రముఖ టీవీ సిరీస్ అగ్గబాయి ససుబాయిలో కనిపించాడు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు