Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

14 Aug, 2022 09:18 IST|Sakshi

ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్‌ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం  6.45 గంటలకు ఝున్‌ ఝన్‌ వాలా మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత‍్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. 

జూలై 5,1960లో హైదరాబాద్‌లో జన్మించిన రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఓ వైపు సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్‌) చదువు కుంటూనే స్టాక్‌ మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్‌ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2018 నాటికి అతని ఆస్తి రూ.11వేల కోట్లకు పెరిగింది.   

స్టాక్‌ మార్కెటర్‌,ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌, హంగామా మీడియా,ఆప్‌టెక్‌లకు ఛైర్మన్‌గా, అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఏవియేషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఝున్‌ ఝున్‌ వాలా 'ఆకాశ ఎయిర్‌' ను ప్రారంభించారు.

(చదవండి: పేటీఎం బాస్‌గా శర్మ నియామకాన్ని ఆమోదించొద్దు)

మరిన్ని వార్తలు