'వీఐ'దూకుడు : ఐపీఎల్ కో-స్పాన్సర్‌

12 Sep, 2020 18:44 IST|Sakshi

సాక్షి, ముంబై: టెలికాం రంగంలో రీబ్రాండింగ్ తరువాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ దూసుకుపోతోంది. వొడాఫోన్ ఐడియా సరికొత్త బ్రాండ్ వీఐ డ్రీమ్11 ఐపీఎల్ 2020కు సహ-సమర్పణ స్పాన్సర్‌గా అవతరించింది. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న టీ 20 ప్రీమియర్ లీగ్ ప్రసార సహ-స్పాన్సర్‌షిప్ హక్కులను కొనుగోలు చేసినట్లు వీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అబూధాబీలో షురూ కానున్న టీ 20 మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. (రీబ్రాండింగ్ తరువాత ‘వీఐ’ కొత్త ప్లాన్లు)

యుఏఈలోని అబుదాబిలో జరగనున్నటీ-20 ప్రీమియర్ లీగ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈడీల్ పై వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ ఆఫీసర్ కవితా నాయర్ సంతోషం వ్యక్తం చేశారు. డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 వీఐ ఒప్పందం మిలియన్ల మంది ప్రేక్షకులతో అనుబంధం, తమ బ్రాండ్ పై అవగాహన పెంచుకోవడమే కాకుండా, వారి విశ్వాసాన్ని పొందడంలో కూడా సహాయపడుతుందన్నారు. వోడాఫోన్,  ఐడియా రెండూ గతంలో స్టార్ స్పోర్ట్స్ ద్వారా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉన్నాయనీ, ఇపుడు వీఐ ద్వారా తిరిగి స్సాన్సర్ గా ఉండటం ఆనందంగా ఉందని స్టార్‌స్పోర్ట్స్  సీఈఓ గౌతమ్ ఠాకర్ అన్నారు.  స్టార్‌స్పోర్ట్స్ భారీ నెట్‌వర్క్  ద్వారా  వీఐ కొత్త బ్రాండ్ గుర్తింపుతోపాటు, భారతదేశం అంతటా మిలియన్లమంది ప్రేక్షకులకు చేరువకానుందన్నారు. 2008 లో క్రీడా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి  జూజూస్‌  క్యాంపెయిన్ ద్వారా భారతదేశంలోని టెలివిజన్ ప్రేక్షకులు,  క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుందని గుర్తు చేశారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు