Vodafone Idea: జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్‌ ఐడియా...!

25 Oct, 2021 20:18 IST|Sakshi

Vi Leads Ookla Speed Test In First Quarter Of 2021: ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్‌ ఐడియా రికార్డును  సృష్టించింది. మొబైల్‌ నెట్‌వర్క్‌ స్పీడ్‌ విషయంలో జియోను, ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టింది. 2021 తొలి త్రైమాసికంలో వోడాఫోన్‌ ఐడియా స్పీడ్‌ స్కోర్‌ 16.10 ఎమ్‌బీపీఎస్‌ను సాధించింది. తొలి త్రైమాసికంగాను వోడాఫోన్‌ ఐడియా ఊక్లా అందించే స్పీడ్‌టెస్ట్‌ అవార్డులను గెలుచుకుంది. కాగా జియో 13.98 ఎమ్‌బీపీఎస్‌, ఎయిర్‌టెల్‌ 13.86 ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్‌ స్కోర్‌ను సాధించినట్లు ఊక్లా ఒక ప్రకటనలో పేర్కొంది. 
చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్

దేశవ్యాప్తంగా సుమారు  19,718,623 స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వాడే ప్రధాన మొబైల్ నెట్‌వర్క్‌ల ఇంటర్నెట్‌ స్పీడ్‌ టెస్ట్‌లను ఊక్లా పరీక్షించింది. రోజువారీ ప్రాతిపదికన చాలా మంది నెట్‌వర్క్ ప్రొవైడర్ల నుంచి కస్టమర్స్‌ పొందుతున్న మొబైల్‌ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్ వేగం, మధ్యస్థ వేగంపై ఊక్లా  దృష్టి సారించింది. ఈ స్పీడ్‌ టెస్ట్‌లను ముంబై, అహ్మాదాబాద్‌, ఢిల్లీ ప్రాంతాల్లో ఊక్లా నిర్వహించింది. 

2021 తొలి త్రైమాసికంలో ఐఫోన్‌ 11, రెడ్‌మీ నోట్‌ 5 ప్రొ, రెడ్‌బీ నోట్‌ 8 ప్రొ, రెడ్‌ మీ నోట్‌7 ప్రొ, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఇంటర్నెట్‌ స్పీడ్‌ డేటాను రికార్డ్ చేసినట్లు ఊక్లా పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా  మధ్యస్థ డౌన్‌లోడ్ వేగం 9.6 ఎమ్‌బీపీఎస్‌గా ఉన్నట్లు ఊక్లా వెల్లడించింది. అయితే..ఆయా మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీల వారిగా వోడాఫోన్‌ ఐడియా 11.34 ఎమ్‌బీపీఎస్‌, ఎయిర్‌టెల్ 10.10 ఎమ్‌బీపీఎస్‌, జియో 8.23 ఎమ్‌బీపీఎస్‌ మేర సగటు మధ్యస్థ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయి.

దేశవ్యాప్తంగా అప్‌లోడింగ్‌ వేగంలో తొలి త్రైమాసికంలో  3.19ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్‌ నమోదైంది. కాగా వోడాఫోన్‌ ఐడియా 4.91 ఎమ్‌బీపీఎస్‌, ఎయిర్‌టెల్ 3.16 ఎమ్‌బీపీఎస్‌, జియో 2.54 ఎమ్‌బీపీఎస్‌ సగటు అప్‌లోడ్ వేగాన్ని  సాధించాయి. 
చదవండి: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ కార్‌..! భారత్‌ నుంచి....

మరిన్ని వార్తలు