వేదాంత చేతికి వీడియోకాన్‌

9 Jun, 2021 08:52 IST|Sakshi

ట్విన్‌స్టార్‌ బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే 

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ను వేలంలో దక్కించుకునేందుకు ట్విన్‌స్టార్‌ టెక్నాలజీస్‌ వేసిన రూ. 3,000 కోట్ల బిడ్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసింది. మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్‌లో భాగమైన ట్విన్‌స్టార్‌ సంస్థ 90 రోజుల్లోగా దాదాపు రూ. 500 కోట్లు, ఆ తర్వాత మిగతా మొత్తాన్ని క్రమంగా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల రూపంలో చెల్లించనుంది.ఎన్‌సీఎల్‌టీ ఈ మేరకు మౌఖికంగా ఉత్తర్వులు వెలువరించిందని, తీర్పు కాపీ రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కారణం కేజీ బేసిన్‌
బ్యాంకులకు వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ వడ్డీతో సహా సుమారు రూ. 31,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీడియోకాన్‌ కొనుగోలు ద్వారా కేజీ బేసిన్‌లోని రవ్వ చమురు క్షేత్రంలో వేదాంతాకు పట్టు చిక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రవ్వ క్షేత్రంలో వీడియోకాన్‌కున్న 25 శాతం వాటాయే కంపెనీ కొనుగోలుకి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు