3 రోజుల పాటు సీబీఐ కస్టడీలో చందా కొచర్‌, దీపక్ కొచర్‌

25 Dec, 2022 13:27 IST|Sakshi

ఐసీఐసీఐ మాజీ సీఈవో, ఎండీ చందాకొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు 3 రోజుల పాటు సీబీఐ కస్టడీని విధించింది. వీడియోకాన్‌ రుణాల అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ 26 తేదీ వరకూ సీబీఐ తన కస్టడీ​లో ఉంచుకోనుంది. ఈ కేసులో వీరివురిని స్వల్పకాలిక విచారణ తర్వాత శనివారం అరెస్టు చేశారు. విచారణలో వారిద్దరూ సహకరించలేదని, అందుకే అరెస్టు చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

కాగా 2012లో చందా కొచర్‌ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్‌ వేణుగోపాల్‌ ధూత్‌.. దీపక్‌ కొచర్‌కి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చందా కొచర్, దీపక్‌ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

మరిన్ని వార్తలు