బ్యాంకులంటే విజయ్‌ మాల్యాకు గుండెల‍్లో దడే! కావాలంటే మీరే చూడండి!

10 May, 2022 16:20 IST|Sakshi

బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్‌బ్యారన్‌ విజయ్‌ మాల్యాను ఇండియాకు రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ లిక్కర్‌ కింగ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

లిక్కర్‌ కంపెనీ నుంచి ఫోర్స్‌ ఇండియా ఫార్ములా వన్‌ దాకా..ఐపీఎల్‌ నుంచి కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ దాకా..విజయ్‌ మాల్యా చేసిన ప్రతీ బిజినెస్‌లోనూ నష్టాలే స్వాగతం పలికాయి. ముఖ్యంగా 2005లో ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం అప్పుల భారాన్ని మరింత పెంచేశాయి. ఇతర వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయి. పైలట్‌లు, ఇంజనీర్‌లకు నెలల తరబడి జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారు. అందుకే 2012లో నాటి భారత కేంద్ర ప్రభుత్వం మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. 

వెరసీ బ్యాంకుల వద‍్ద తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి బ్యాంకులకు చెల్లించలేక 2016లో భారత్‌ నుంచి పారిపోయాడు. అందుకే బ్యాంక్‌లు విజయ్‌ మాల్యాకు ఇచ్చిన రుణాల్ని ముక్కుపిండి వసూలు చేస్తుంటే..ఇటు కేంద్రం సైతం యూకే నుంచి భారత్‌కు తెప్పించే ప్రయత్నాల్ని కొనసాగిస‍్తుంది.

  

ఈ క్రమంలో విజయ్‌ మాల్యా ట్విట్‌లపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే? విజయ్‌ మాల్యా నిత్యం ట్విటర్‌లో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సమయం, సందర్భాన్ని బట్టి ఏదో ఒక ట్విట్‌ చేస్తుంటారు. ఇంతకీ ఆ ట్విట్‌లు ఎప్పుడు వేస్తుంటారో తెలుసా? బ్యాంక్‌లకు హాలిడేస్‌లో ఉన్నప్పుడు లేదంటే రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే. కావాలంటే మీరే చూడండి అంటూ నెటిజన్లు విజయ్‌ మాల్యా చేసిన ట్విట్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు విజయ్‌ మాల్యా సంక్రాంతి,హోలీ, ఉగాది, విషు, ఈస్టర్,ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌లో క్రిస్మస్, న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతూ ఒక ట్వీట్ చేశాడని, అందుకు సంబంధించిన ట్విట్‌లను వైరల్‌ చేస్తున్నారు. 

దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. బ్యాంకులంటే చిన్న చిన్న రుణాలు తీసుకున్న వారికే కాదండోయ్‌..వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యా లాంటి వాళ్లకు కూడా భయమేనని కామెంట్‌ చేస్తున్నారు. అతను మంచి రుణగ్రహీత. హాలిడేస్‌లో తప్పా..వర్కింగ్‌ డేస్‌లో బ్యాంకర్లను అస్సలు డిస్ట్రబ్‌ చేయడు అని ఒక నెటిజన్‌ అంటుంటే ..రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే ట్విట్‌ చేస్తాడు"అని చమత్కరించాడు.

చదవండి👉అమ్మకానికి విజయ్‌మాల్యా ఇల్లు.. చివరి నిమిషంలో ట్విస్ట్‌

మరిన్ని వార్తలు