Apple Days Sale: ఆపిల్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్‌ బ్యాక్‌..!

3 Aug, 2021 20:22 IST|Sakshi

భారత ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌ దిగ్గజం విజయ్‌ సేల్స్‌ ఆపిల్‌ ఉత్పత్తులపై భారీగా క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆపిల్‌ డేస్‌ సేల్‌ను విజయ్‌ సేల్‌ ప్రకటించింది. ఈ సేల్‌ మంగళవారం ఆగస్టు 3 న మొదలై ఆగస్టు 9 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆపిల్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ల నుంచి మాక్‌బుక్స్‌తో పాటు ఇతర ఆపిల్‌ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా భారీగా క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. దేశ వ్యాప్తంగా కంపెనీ రిటైల్‌ అవుట్‌లెట్లలో ఈ ఆఫర్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీకి చెందిన వెబ్‌సైట్‌ విజయ్‌సేల్స్‌. కామ్‌లో కూడా కొనుగోలు చేయవచ్చును. 

ఆపిల్‌ ఉత్పత్తులపై విజయ్‌ సేల్స్‌  అందిస్తోన్న  ఆఫర్‌లు..!

  • ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ. 50,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును.
  • ఐఫోన్‌ 12 ప్రో ధర రూ. 1,09,900 నుంచి ప్రారంభంకానుంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును.
  • ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,19,999 నుంచి ప్రారంభంకానుంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును.
  • ఐఫోన్ 12 ధర ప్రారంభ ధర రూ. 73,400. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును.
  • ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 63.499. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును.
  • ఐఫోన్‌ ఎస్‌ఈ ప్రారంభ ధర రూ. 35,990. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును.
  • ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ప్రారంభ ధర రూ. 43,199. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. 
  • ఐపాడ్‌ ప్రారంభ ధర రూ. 24,500 కాగా, ఐపాడ్‌ ప్రో ప్రారంభ ధర రూ. 55,900 కాగా చ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. 
  • మాక్‌బుక్‌ ఎర్‌ ఎమ్‌1, మాక్‌బుక్‌ ప్రో విత్‌ ఎమ్‌1 చిప్‌ సెట్‌ కొనుగోలుపై వరుసగా రూ. 6000, రూ 7000 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. 
  • ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ కొనుగోలుపై వరుసగా రూ. 3000, రూ. 2000 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు