అమెరికాకి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన మంత్రి.. మెచ్చుకుంటున్న సీఈవోలు

13 Apr, 2022 15:54 IST|Sakshi

రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలపై వెస్ట్రన్‌ మీడియా, అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న ​ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ అద్భుతమైన సమాధానం ఇచ్చారంటూ పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ మెచ్చుకున్నారు. భారత వైఖరిరి అంతర్జాతీయంగా సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న జైశంకర్‌కి కావాల్సినంత ప్రచారం ఎందుకు లభించడం లేదంటూ ప్రశ్నించారు. శేఖర్‌ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించారు ఎడిల్‌వైజ్‌ సీఈవో రాధికా గుప్తా. విపత్కర పరిస్థితులను ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొవాలో చెప్పేందుకు ఈ సంభాషణ మాస్టర్‌ క్లాస్‌ అంటూ రాధికా గుప్తా అభిప్రాయపడింది.

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ రష్యాతో భారత సంబంధాలపై అమెరికా మొదటి నుంచి ఆడిపోసుకుంటోంది. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య శతృత్వం పెచ్చరిల్లడానికి స్వయంగా తానే కారణమై ఉండీ కూడా నిత్యం ఇతర దేశాల వైపు తప్పులు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాతో భారత​ అంటకాగుతోందంటూ పదేపదే విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు విదేశాంగ మంత్రి జై శంకర్‌. 

అమెరికా మంత్రులతో జరిగిన టూ ప్లస్‌ టూ సమావేశంలో మంత్రి జై శంకర్‌ మాట్లాడుతూ కేవలం మధ్యాహ్నం వేళ యూరప్‌ దేశాలను రష్యా నుంచి ఎంత ఆయిల్‌ దిగుమతి చేసుకుంటాయో అంతకంటే తక్కువ ఆయిల్‌ని ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందంటూ కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌ యుద్ధానికి వ్యతిరేకమని, చర్చల ద్వారా ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలంటూ ఇప్పటికే అనేక వేదికల మీద భారత్‌ చెప్పిందంటూ భారత వైఖరికి పునరుద్ఘాటించారు జై శంకర్‌.

మరిన్ని వార్తలు