విక్రమ్‌ సోలార్‌ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ 

18 Aug, 2022 10:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ మాడ్యూల్‌ తయారీ కంపెనీ విక్రమ్‌ సోలార్‌ పబ్లిక్‌ ఇష్యూకి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అను మతి లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 50 లక్షల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

స్టాక్‌ ఎక్స్చేంజీల లిస్టింగ్‌కు వీలుగా కంపెనీ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ తయారీసహా.. సమీకృత సోలార్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను 2,000 మెగావాట్ల సామర్థ్యంగల సమీకృత సోలార్‌ సెల్, సోలార్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. 2021 డిసెంబర్‌కల్లా రూ. 4,870 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు