వైరల్‌: జాబ్‌కు ఆప్లికేషన్‌ ఇవ్వలేదు.. ఓ వీడియోతో జాబ్‌ కొట్టేశాడు..!

7 Jun, 2021 17:52 IST|Sakshi

ముంబై: కరోనా మహామ్మారి పుణ్యానా విద్యార్థులందరు ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థులు ఇంట్లోనే ఉండి తమ అకడమిక్‌ ఇయర్‌ను కొనసాగిస్తున్నారు.  విద్యార్థుల్లో కొంతమంది తమ డిగ్రీని పూర్తి చేసి ఉద్యోగాల కోసం నానాతంటాలు పడుతుండగా.. అందుకోసం వీలైనన్నీ కంపెనీలకు ఆప్లికేషన్‌లను పంపుతూ.. తమ అదృష్టాన్ని చెక్‌ చేసుకుంటున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డ్రీమ్‌ జాబ్‌ను సంపాదించుకోవడం ఎంతగానో కష్టపడుతున్నారు. మనలో సత్తా ఉండాలేగానీ.. ఉద్యోగమే మనల్ని వెతుకుంటూ వస్తోంది.  కాగా ముంబైకు చెందిన 21 ఏళ్ల అవ్కాష్ షా (గ్రాఫిక్‌ డిజైనర్‌) విషయంలో అదే జరిగింది.

అవ్కాష్‌ తన డ్రీమ్‌ జాబ్‌ సంపాదించుకోవడం కోసం.. భిన్నంగా ఆలోచించి తన శక్తి సామర్య్థాలను నేరుగా కంపెనీకి చూపించలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ 3డీ  మోషన్‌ వీడియోను తన లింక్డిన్‌ ఖాతాలో ప్రముఖ క్రెడిట్‌కార్డు కంపెనీ క్రిడ్‌ను టాగ్‌ చేన్తూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, సుమారు పది లక్షల వరకు వ్యూస్‌ వచ్చాయి. వీడియోను చూసిన పలు కంపెనీలు అవ్కాష్‌ షాకు ఉద్యోగాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

కాగా  ఈ వీడియోను క్రిడ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు కునాల్‌ షాను ఎంతగానో ఆకర్షించింది.  కంపెనీ నుంచి అవ్కాష్‌ షా క్రిడ్‌ డిజైన్‌ మాఫియాలోకి వెల్కమ్‌ అంటూ మెసేజ్‌ను పంపించింది. దీంతో అవ్కాష్‌ షా ఆనందానికి హద్దులేకుండా పోయింది.

ఈ వీడియోతో తాను కోరుకున్న డ్రీమ్‌ జాబ్‌ను సంపాదించుకోవడంలో మార్గం సుగుమం చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన లింక్డిన్‌ అవ్కాష్‌ను మెచ్చుకుంది.

చదవండి: యూట్యూబ్ కొత్త అప్ డేట్స్‌, అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న క్రియేట‌ర్స్‌

మరిన్ని వార్తలు