రోదసీలోకి వెళ్లొచ్చిన నాలుగో భారతీయురాలు శిరీష

12 Jul, 2021 10:19 IST|Sakshi

హూస్టన్‌: వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలో చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ షిప్‌లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్‌ బ్రాన్సన్‌తో  5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం 90 నిమిషాల పాటు సాగింది. ఈ షిప్‌లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్‌ చేశారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌
అంతరిక్ష యాత్రను విజయవంతం చేసుకున్న శిరీషకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం రాష్ట్రానికి గర్వించదగ్గ క్షణమని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  


 

మరిన్ని వార్తలు