క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు అనుమతించిన వీసా

29 Mar, 2021 20:23 IST|Sakshi

క్రిప్టోకరెన్సీలకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సంస్థ వీసా కీలక నిర్ణయం తీసుకుంది. ఇథీరియమ్ నెట్వర్క్ ద్వారా డిజిటల్ కరెన్సీ యూఎస్‌డీ కాయిన్‌లో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. విసా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ డిజిటల్ కరెన్సీని సాధారణ నగదు రూపంలో మార్చే అవసరం తప్పనుంది. వీసా కంటే ముందే ఇతర ప్రముఖ సంస్థలైన బీఎన్‌వై మెలన్, బ్లాక్‌రాక్, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు డిజిటల్ కరెన్సీ చెల్లింపులను అనుమతించాయి. 
 
వీసా సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ గత వారం.. వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను బిట్‌కాయిన్‌తో కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇది వాణిజ్యంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఒక కీలక ముందడుగు అని చెప్పుకోవాలి. ఇప్పటవరకూ వీసా ద్వారా క్రిప్టోకరెన్సీల్లో చెల్లింపులు చేయాలనుకుంటే వీటిని ముందుగా సాధారణ నగదులోకి మార్చాల్సిన అవసరం ఉండేంది. అయితే..ఈథీరియమ్ టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు వీసా అనుమతించడంతో ఈ నగదు మార్పిడి అవసరం తప్పిపోయింది. డిజిటల్ కరెన్సీ డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యూ షెఫీల్డ్ అన్నారు.

చదవండి:

సింగిల్ ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణం! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు