రూపేకార్డులపై అమెరికన్‌ కంపెనీ కుతంత్రం..!

28 Nov, 2021 16:14 IST|Sakshi

Visa Complains To US Govt About India Backing For Local Rival Rupay: అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థ వీసా తన ప్రత్యర్థి రూపేపై కుతంత్రాలకు పాల్పడుతోంది. భారత్‌లో వీసాను రూపే భారీగా దెబ్బతీస్తోందని  అమెరికన్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు రాయిటర్స్‌ ఒక కథనంలో పేర్కొంది. రూపేపై భారత్‌ చేస్తున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలని వీసా తన ఫిర్యాదులో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 

కారణం ఇదే..!
దేశీయ చెల్లింపుల రూపేకి భారత ప్రభుత్వం "అనధికారిక, అధికారికంగా" ప్రచారం చేస్తోందని వీసా తన ఫిర్యాదులో పేర్కొంది. భారత ప్రభుత్వం రూపే డెబిట్‌ కార్డులపై భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు వీసా పేర్కొంది. రూపేకు భారత్‌లో భారీ ఆదరణ వస్తోండడంతో వీసా ఓర్వడం లేదు. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా రూపేకు మద్దతు వస్తోందని వీసా అమెరికా ప్రభుత్వానికి తన ఫిర్యాదులో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్ధానిక కార్డుల వినియోగాన్ని ఏకంగా జాతీయ సేవతో పోల్చరాన్ని వీసా అమెరికా ప్రభుత్వానికి దాఖలు చేసిన మెమోలో పేర్కొన్నట్లు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. 

లాభాపేక్షలేని సంస్థ రూపే..!
ఇతర దేశీయ , విదేశీ ఎలక్ట్రానిక్ చెల్లింపుల కంపెనీల కంటే రూపేను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" (NPCI) ఏలాంటి లాభాపేక్షలేకుండా నడుపుతోంది.   వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్‌లో వీసా, మాస్టర్‌కార్డ్‌లకు సవాలుగా మారడంతో ప్రధాని మోదీ స్వదేశీ రూపే కార్డును ప్రోత్సహించారు. దీంతో రూపే కార్డుపై భారీ ఎత్తున​ ఆదరణ లభించింది. నవంబర్ 2020 నాటికి భారత్‌లోని 952 మిలియన్ల డెబిట్ , క్రెడిట్ కార్డ్‌లలో రూపే 63 శాతం వాటాను కలిగి ఉంది. గతంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ "రూపే కార్డును మాత్రమే" బ్యాంకులు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రజా రవాణా చెల్లింపుల కోసం ప్రభుత్వం రూపే ఆధారిత కార్డును కూడా ప్రమోట్ చేసింది.

భారత్‌లో మార్కెట్‌ లీడర్‌ మేమే..!
ఈ ఏడాది మేలో  రూపే లాంటి సంస్థలు వీసాకు సమస్యాత్యకంగా మారే అవకాశం ఉందని వీసా ఎగ్జిక్యూటివ్‌ అధికారి అల్‌ప్రెడ్‌ కెల్లీ వెల్లడించారు. అయితే వీసానే భారత మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతుందని కెల్లీ చెప్పారు. 

అంతకుముందు మాస్టర్‌కార్డ్‌ కూడా..!
భారత్‌పై ఫిర్యాదు చేసిన వాటిలో  వీసా ఒక్కటే కాదు. అంతకుముందు 2018లో మరో ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థ మాస్టర్‌ కార్డ్‌ కూడా యూఎస్‌ ప్రభుత్వానికి మెమోలను దాఖలు చేసింది. స్వదేశీ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ జాతీయవాదాన్ని ఉపయోగిస్తున్నట్లు యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌తో ఫిర్యాదు చేసింది. 2018 నిబంధనలకు అనుగుణంగా లేదని రిజర్వ్‌ బ్యాంక్ ఆదేశాలతో మాస్టర్ కార్డ్ భారత్‌లో కొత్త కార్డ్‌లను జారీ చేయడంపై నిరవధిక నిషేధాన్ని ఎదుర్కొంటుంది. యూఎస్‌టీఆర్‌ అధికారి మాస్టర్‌కార్డ్ నిషేధాన్ని "క్రూరమైన చర్య" అని పిలిచారు.
చదవండి: పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..

మరిన్ని వార్తలు