Vishal Garg: బెటర్‌డాట్‌ కామ్‌ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!

15 May, 2022 14:27 IST|Sakshi

జూమ్ మీటింగ్‌ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ మరోసారి చర్చాంశనీయమయ్యారు. ఈ సారి ఏకంగా 920మంది భారతీయ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు.


మోర్టగేజ్‌ లెండింగ్‌ కంపెనీ బెటర్‌ డాట్‌ కామ్‌ అమెరికా కేంద్రంగా  కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ ఆర్ధికంగా ఆదుకుంటుంది. బెటర్‌ డాట్‌ కామ్‌ సంస్థ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1.5 బిలియన్ల నిధుల్ని సేకరించారు. అందులో వ్యక్తిగతంగా సాఫ్ట్‌ బ్యాంక్‌కు 750 మిలియన్‌ డాలర్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితులు గార్గ్‌ను ఆర‍్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. 

గతేడాది డిసెంబర్‌లో బెటర్‌ డాట్‌ కామ్‌ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు విశాల్‌ గార్గ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 900మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తొలగింపు సంచలనం సృష్టించింది. తమ అనుమతులు లేకుండా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం అంటూ ఉద్యోగులు గార్గ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ఈ ఏడాది మార్చిలో 4వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. ఇక మనదేశానికి చెందిన 920 ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలకు ఆమోదం తెలిపారు. 

అరోరాను సొంతం చేసుకునేందుకే 
గతేడాది నవంబర్‌లో అరోరా అక్విజిషన్ కార్ప్ సంస్థను బెటర్‌.కామ్‌ 1.5బిలియన్‌లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ఒప్పందంలో భాగంగా సాఫ్ట్‌ బ్యాక్‌ ఇచ్చే రుణం కోసం ఎదురు చూడకుండా అరోరా అక్విజిషన్‌ కార్ప్‌కు సగం చెల్లించి ఈ కొనుగోళ్ల డీల్‌ను క‍్లోజ్‌ గార్గ్‌ క్లోజ్‌ చేశారు. ఈ సందర్భంగా అరోరా ప్రతినిధులు మాట్లాడుతూ.. బెటర్‌ సంస్థ ఫౌండర్‌, అధినేత విశాల్‌ గార్గ్‌ సాఫ్ట్‌ బ్యాంక్‌కు రుణాల్ని ఇచ్చేలా వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ రుణాల్ని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. 
 
కాబట్టి స్వచ్ఛంగా సంస్థ నుంచి స్వచ్చందంగా వెళ్లి పోవాలనుకున్న 920మంది భారతీయ ఉద్యోగులు రాజీనామాల్ని అంగీకరించారు. ఈ క్రమంలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 750 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇక నాదగ్గర ఏమీలేదు. ఇది నిజం. నేను వ్యక్తిగతంగా మూడు వంతుల బిలియన్ డాలర్లకు హామీ ఇచ్చాను. దానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాను. "అని ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో పేర్కొన్నారు. 

చదవండి👉విశాల్‌ గార్గ్‌ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే..

మరిన్ని వార్తలు