ఏపీలో విష్ణు కెమికల్స్‌ పెట్టుబడులు

28 Feb, 2023 00:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్‌ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లో స్పెషాలిటీ కెమికల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. విష్ణు కెమికల్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా 57 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఆటోమొబైల్, ఫార్మా, ఉక్కు తదితర పరిశ్రమలకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు