Vistara Flight Engine Fail: వరుస ఘటనలతో గుండెల్లో రైళ్లు

6 Jul, 2022 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణీకుల గుండెల్లో  రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.  ఇప్పటికే ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ విమానంలో విండ్‌షీల్డ్‌ క్రాక్‌ కారణంగా బుధవారం ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయింది.  దీనిపై డీజీసీఐ సంస్థకు నోటీసులు కూడా జారి చేసింది. 

తాజాగా మరో ప్రైవేటు విమానయాన సంస్థ  విస్తారా విమానంలో ఇంజీన్‌ ఫెయిల్‌ అయిన ఘటన ఆందోళన రేపింది. అయితే విమానం సేఫ్టీగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి బయలుదేరి, ఢిల్లీలో ల్యాండ్ అయిన  వెంటనే విస్తారా విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో విమానాన్ని ట్యాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి లాగాల్సి వచ్చింది.

బ్యాంకాక్-ఢిల్లీ విమానం UK-122 (సింగిల్ ఇంజన్‌) నిన్న (మంగళవారం) ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు  ఈ సంఘటన జరిగిందని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఢిల్లీలో ల్యాండింగ్‌  తర్వాత, పార్కింగ్ బేకు వెళుతున్న క్రమంలో  చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందని, అయితే ప్రయాణీకుల భద్రత రీత్యా అప్రమత్తమైన సిబ్బంది  ట్యాక్సీవే నుంచి పార్కింగ్ విమానాన్ని తరలించారని  విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. 

మరిన్ని వార్తలు