5జీ స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాల్లో దూసుకెళ్తున్న వివో

8 Jul, 2021 15:23 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో సత్తా చాటుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాల్లో శామ్ సంగ్ తర్వాత ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండవ బ్రాండ్‌ గా నిలిచినట్టు పరిశోధన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే వివో అమ్మకాలు 62 శాతం పెరిగి 1.94 కోట్ల యూనిట్లు నమోదయ్యాయని వివరించింది. 5జీ ప్రమాణాలు, కీలక సాంకేతికత విషయంలో కంపెనీ పురోగతి సాధించిందని వివో తెలిపింది. 

చైనా యూరప్‌లో వివో సుస్థిర స్థానం సంపాదించింది. ఆపిల్ ఇప్పటికి 5జీ టాప్ బ్రాండ్ గా కొనసాగుతుంది. ప్రపంచ మార్కెట్లో ఈ కంపెనీ 29.8 శాతం వాటాను కలిగి ఉంది. తరువాత స్థానంలో ఒప్పో 15.8 శాతం వాటాతో ఉండగా, వివో 14.3 శాతం వాటాను కలిగి ఉన్న మూడవ అతిపెద్ద 5జి బ్రాండ్ గా నిలిచింది.

మరిన్ని వార్తలు