వివో వీ 27 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌.. ధరలు ఉన్నాయంటే

1 Mar, 2023 15:23 IST|Sakshi

సాక్షి,ముంబై:   చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్   వివో రెండు ఫ్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. టాప్‌ ఎండ్‌  మీడియా టెక్‌ సాక్‌ ప్రాపెసర్లతో వివో వీ27, వివో వీ27 ప్రో  పేరుతో వీటిని తీసుకొచ్చింది.

వివో వీ 27, వివో వీ 27 ప్రొ ఫీచర్లు  
ప్రాసెసర్‌ తప్ప వివీ వీ 27  సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు దాదాపు రెండూ ఒకే విధమైన  ఫీచర్లతో వచ్చాయి. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత FunTouch OS 13ని,  120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే, 4600mAh బ్యాటరీ  ప్రధాన ఫీచర్లు. ఇంకా 50+2+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌  కెమెరా, అలాగే ఆటో  ఫోకస్‌  50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. 

వివో వీ 27, వివో వీ 27 ప్రొ ధర, లభ్యత
వివో వీ 27 ప్రొ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 37,999 
8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ధర 39,999.
టాప్-ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 42,999. 

 వివో వీ 27: 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌  రూ. 32,999 
12 జీబీ ర్యామ్‌, 256  జీబీ స్టోరేజ్‌ రూ. 36,999  

ఈ  స్మార్ట్‌ఫోన్లు సిరీస్ మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ షేడ్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్‌, వివొ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయం.  వివో వీ27 ప్రొ ప్రీ-బుకింగ్ ఈ రోజు (మార్చి 1) ప్రారంభం. మార్చి 6 నుండి  సేల్‌ షురూ.   ఇక వివో వీ27 సేల్‌  మార్చి 23 నుండి ప్రారంభం. అలాగే కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ,  కోటక్ మహీంద్రా బ్యాంకు  కార్డు కొనుగోళ్ల ద్వారా మూడు వేలు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ. 2500 exchange బోనస్‌ కూడా లభిస్తుంది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు