వావ్‌ అనే లుక్‌లో వివో వై16.. ఫీచర్లు అదిరే, రూ.10వేల కన్నా తక్కువే!

27 Sep, 2022 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్‌ వివో కొత్తగా తమ వై–సిరీస్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9,999 (3జీబీ+32 జీబీ) నుంచి రూ. 12,499 (4 జీబీ+64 జీబీ) వరకూ ఉంటుంది.

స్టెల్లార్‌ బ్లాక్, డ్రిజ్లింగ్‌ గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది. కోటక్, ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్, బీవోబీ, ఫెడరల్, ఏయూ బ్యాంక్‌ కార్డులతో రూ. 1,000 వరకూ, ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులపై రూ. 750 మేర క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. 6.51 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్, ఫేస్‌ వేక్‌ ఫీచర్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ట్రిపుల్‌ కార్డ్‌ స్లాట్, 13 ఎంపీ మెయిన్‌.. 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కమెరా, మీడియాటెక్‌ పీ35 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది.

చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!

మరిన్ని వార్తలు