వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్‌సైట్‌, డౌన్‌లోడ్‌ లింక్‌ బ్లాక్‌

13 Aug, 2022 11:59 IST|Sakshi

ముంబై: పబ్‌జీ మొబైల్‌,  టిక్‌టాక్‌, కామ్‌స్కానర్‌ సహా వందలాది చైనీస్ యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం తాజాగా ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను కూడా బ్యాన్‌ చేసింది.  ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్‌ను కూడా బ్లాక్ చేసింది. మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే  ఐటీ  చట్టం కింద నిషేధించిన సందేశం కనిపిస్తోంది. అంటే ఇకపై  దేశంలో ఎవరూ ఏ పని కోసం ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేరన్నమాట. 

ఇటీవల బీజీఎంఐ అనే పబ్‌జీ మొబైల్‌ ఇండియన్‌ వెర్షన్‌ను బ్లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజా  నివేదికల ప్రకారం IT చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌కు చెక్‌ చెప్పింది కేంద్రం. అయితే చైనా-మద్దతు గల హ్యాకింగ్ గ్రూప్ సికాడా సైబర్ దాడులకు ప్లాట్‌ఫారమ్ అయినందున VLC మీడియా ప్లేయర్ దేశంలో బ్లాక్ చేసినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ లోడ్‌ కోసం సికాడా వీఎల్సీ మీడియా ప్లేయర్‌ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు. VideoLAN ప్రాజెక్ట్ ద్వారా తయారైన వీఎల్‌సీ ప్లేయర్ భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం కేంద్రం బ్లాక్ చేసింది. (Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్‌ కొత్త రికార్డు)

అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి,ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గగన్‌దీప్ సప్రా అనే ట్విటర్ యూజర్‌లలో ఒకరు వీఎల్‌సీ వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసారు, "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్‌సైట్ బ్లాక్ చేయబడింది" అని చూపిస్తుంది. ప్యారిస్‌కు చెందిన వీడియోలాన్ సంస్థ వీఎల్సీ మీడియాని అభివృద్ధి చేసింది.  (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్‌ అనాల్సిందే!)

మరిన్ని వార్తలు