Vodafone Job Cuts: వొడాఫోన్‌లో ఉద్యోగుల తొలగింపు.. 11 వేల మందిపై వేటు!

16 May, 2023 14:10 IST|Sakshi

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌  లేఆఫ్స్‌ ప్రకటించింది. రానున్న 3 ఏళ్లలో 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్గరీటా డెల్లా వల్లే తెలిపారు. 

త‌మ సామ‌ర్ధ్యం త‌గినంత‌గా లేద‌ని, నిరంతరం మెరుగైన సేవ‌లు అందించే క్ర‌మంలో వొడాఫోన్ విధిగా మారాల‌ని డెలా వ‌లె స్ప‌ష్టం చేశారు. ‘కస్టమర్లు, సరళత, వృద్ధి ఈ మూడు అంశాలే మా లక్ష్యం. వీటి ఆధారంగా మార్కెట్‌లో నెలకొన్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు సంస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతేకాదు కస్టమర్లకు నాణ్యమైన సేవల్ని అందించేలా వనరులను కేటాయిస్తూ మరింత వృద్ధి సాధిస్తామని మార్గరీటా డెల్లా ధీమా వ్యక్తం చేశారు.

సంస్థ సైతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి నేపథ్యంలో వొడాఫోన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం టెలికాం రంగానికి చెందిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గత ఏడాది వొడాఫోన్‌లో 104,000 మంది సిబ్బంది ఉండగా.. తాజాగా మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 10శాతానికి పైగా సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

చదవండి👉 అమెజాన్‌లో లేఆఫ్స్‌.. భారత్‌లో 500 మంది ఉద్యోగుల తొలగింపు!

మరిన్ని వార్తలు