వొడాఫోన్‌ కొత్త ప్లాన్‌: జియో, ఎయిర్టెల్‌ తరహాలోనే, ఏది బెటర్‌?

2 Mar, 2023 14:46 IST|Sakshi

సాక్షి,ముంబై:వొడాఫోన్‌ ఇండియా సరికొత్త ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ  ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, జియోకు చెందిన  రూ.296 రీచార్జ్‌ ప్లాన్లకు దీటుగా తాజా  బల్క్‌ డేటా ప్లాన్‌ను  తీసుకొచ్చింది.

వొడాఫోన్‌  రూ.296 ప్లాన్
వాలిడిటీ  30 రోజులు 
25 జీబీ  బల్క్ డేటా
అపరిమిత వాయిస్ కాలింగ్‌.   రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు  ఉచితం 
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వీఐ మూవీస్‌, టీవీని ఎంజాయ్‌ చేయవచ్చు కానీ, వివో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలుండవు. 

ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే
25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్‌లో  అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ.

రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే
25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు  100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
 ఈ ప్లాన్‌లో రిలయన్స్‌ జియో  వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్‌,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు