వేగం పెంచిన వోడాఫోన్‌.. 5జీ వేగం ఎంతంటే?

8 Nov, 2021 08:19 IST|Sakshi

న్యూఢిల్లీ: 5జీ ట్రయల్స్‌లో భాగంగా వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌పై వేగం 9.85 జీబీపీఎస్‌ నమోదైందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా తెలిపింది. 80 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంలో ఈ–బ్యాండ్‌ మైక్రోవేవ్‌ను వినియోగించి ఈ ఘనతను సాధించినట్టు వెల్లడించింది.

ఫైబర్‌ కేబుల్స్‌ వేయలేని ప్రాంతాల్లో ఈ–బ్యాండ్‌ ద్వారా.. స్మాల్‌సెల్స్, మాక్రోసెల్స్‌ను అనుసంధానించడం ద్వారా ఫైబర్‌ స్థాయి వేగంతో 5జీ సేవలను అందించేందుకు వొడాఫోన్‌ ఐడియా ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కంపెనీ తెలిపింది.  
 

మరిన్ని వార్తలు