2 కోట్ల మంది వొడాఫోన్‌ యూజర్ల డేటా బహిర్గతం 

31 Aug, 2022 10:48 IST|Sakshi

సైబర్‌ఎక్స్‌9 వెల్లడి 

ఖండించిన వీఐ  

న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) సిస్టమ్‌లోని పలు లోపాల వల్ల దాదాపు 2 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్ల కాల్‌ డేటా రికార్డులు బహిర్గతం అయినట్లు సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ సంస్థ సైబర్‌ఎక్స్‌9 ఒక నివేదికలో వెల్లడించింది. ఏ కాల్స్‌ను ఎవరికి, ఎన్నింటికి, ఎంత సేపు, ఎక్కడ నుంచి చేశారనే వివరాలతో పాటు కస్టమర్ల పూర్తి పేరు, చిరునామా మొదలైన సమాచారం అంతా కూడా వీటిలో ఉన్నాయని పేర్కొంది.

ఈ విషయాన్ని వీఐకి ఆగస్టు 22న తెలియజేయగా, సిస్టమ్‌లోని లోపాలను గుర్తించినట్లు ఆగస్టు 24న కంపెనీ తమకు ధృవీకరించినట్లు వీఐ తెలిపింది. మరోవైపు, నివేదికలో పేర్కొన్నట్లుగా డేటా ఉల్లంఘన వార్తలను వీఐ ఖండించింది. నివేదికంతా తప్పుల తడకని, విద్వేషపూరితమైనదని వ్యాఖ్యానించింది. తమ ఐటీ సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగానే ఉందని, కస్టమర్ల డేటా సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. బిల్లింగ్‌ విషయంలో లోపాలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించామని, దాన్ని వెంటనే సరిచేశామని పేర్కొంది.  

చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్‌)

మరిన్ని వార్తలు