రీబ్రాండింగ్ తరువాత ‘వీఐ’ కొత్త ప్లాన్లు

11 Sep, 2020 15:01 IST|Sakshi

సాక్షి,ముంబై: వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ‘వీఐ’గా రీబ్రాండింగ్ పూర్తి చేసుకున్నఅనంతరం సరికొత్త ప్రణాళికలపై దృష్టి పెట్టింది. తాజాగా కొత్త ప్లాన్లను ప్రకటించింది. తద్వారా వినియోగదారులను  ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అందరూ ఊహించినట్టుగా డేటా ప్లాన్లు కాదు. కాలర్ ట్యూన్ల ప్లాన్లు. ప్రత్యక కాలర్‌ట్యూన్‌ల కోసం వొడాఫోన్ ఐడియా వీఐ కాలర్ ట్యూన్ అనే స్పెషల్ యాప్ ప్రారంభించింది. ఇందులో కస్టమర్లు తమ కిష్టమైన కాలర్ ట్యూన్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వీఐ కాలర్‌టూన్స్  ప్లాన్స్  రూ .49, రూ .69, రూ.99, రూ .249 గా  ఉన్నాయి.  వినియోగదారులు ప్రొఫైల్ ట్యూన్స్ , తమ పేరుతో పాటు  స్టేటస్ టోన్‌ను సెట్ చేసుకోవచ్చు. 

కాగా టెలికాం మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా త్వరలో ప్లాన్ల టారిఫ్ లు పెరిగే అవకాశం ఉందని రీబ్రాండింగ్ తరువాత వొడాఫోన్ ఐడియా సంకేతాలిచ్చింది. కానీ ప్రస్తుతానికి డేటా ప్లాన్లలో ఎలాంటి మార్పులను  ప్రకటించలేదు. (వొడాఫోన్‌ ఐడియా కొత్త బ్రాండ్‌ వీఐ)

వీఐ కాలర్ ట్యూన్ ప్లాన్స్ 

  • రూ .49 ప్లాన్:  ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు ,  పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు 50 కాలర్ ట్యూన్లు ఉచితం 
  • రూ .69 ప్లాన్: ఈ ప్లాన్ లో  పరిమితి లేదు. అన్ లిమిటెడ్ గా వాడుకోవచ్చు.  ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు అపరిమితంగా కాలర్ ట్యూన్‌లను మార్చుకోవచ్చు.
  • రూ .99 ప్లాన్:  100 కాలర్ ట్యూన్లను మూడు నెలలు ఉచితం
  •  రూ .249 ప్లాన్ :  ఒక ఏడాదికి 250 కాలర్ ట్యూన్లు ఉచితం
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా