వొడాఫోన్ ఐడియా బంపరాఫర్

31 Dec, 2020 17:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో 2020 ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కువ శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీలు యూజర్లకు తక్కువ ధరకే ఇంటర్ నెట్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విఐ(వోడాఫోన్ ఐడియా) కూడా ప్రీపెయిడ్ చందాదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్‌లలోని వినియోగదారులకు లభిస్తుంది అని విఐ పేర్కొంది. (చదవండి: రూ.500 లోపు బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఇవే!)

ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు విఐ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ని సందర్శించాలని పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన వినియోగ దారులకు ఈ ఆఫర్ గురించి విఐ టెక్స్ట్ సందేశాలను కూడా పంపుతున్నట్లు పేర్కొంది. వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక కింద సాధారణంగా 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది.
 

మరిన్ని వార్తలు