వొడాఫోన్‌ ఐడియా నష్టాలు అప్‌

16 Feb, 2023 04:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో మొబైల్‌ టెలికం రంగ కంపెనీ వొడాఫోన్‌ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర నష్టం పెరిగి రూ. 7,990 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,234 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతంపైగా బలపడి రూ. 10,621 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. రూ. 9,717 కోట్ల టర్నోవర్‌ నమోదైంది.

ఈ కాలంలో కంపెనీ రూ. 16,133 కోట్లమేర (స్పెక్ట్రమ్‌ వాయిదాలు, ఏజీఆర్‌ బకాయిలపై) చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం ఈక్విటీగా మారి్పడి చేసుకుంది. దీంతో వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం 33 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. మరోపక్క కంపెనీ బోర్డు ఏటీసీ ఇండియాకు రూ. 1,600 కోట్ల విలువైన అప్షనల్లీ కన్వరి్టబుల్‌ డిబెంచర్ల జారీకి ఆమోదించింది.  కాగా, తాజా సమీక్షా కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 17 శాతంపైగా మెరుగై రూ. 135ను తాకింది. మొత్తం కస్టమర్ల సంఖ్య 23.44 కోట్ల(క్యూ2) నుంచి 22.86 కోట్లకు నీరసించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 7.70 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు