Increase Prices: మొబైల్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌...!

23 Oct, 2021 15:55 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ 50 శాతం మేర సబ్‌స్క్రిప్షన్‌ ధరలను త్వరలోనే పెంచుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నెల, త్రైమాసిక, వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ధరలు సుమారు 50 శాతం మేర పెరగనున్నాయి. పెరగబోయే సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పలు టెలికాం సంస్థల యూజర్లకు షాక్‌ ఇవ్వనున్నాయి.    

వోడాఫోన్‌ ఐడియా, జియో, ఎయిర్‌టెల్‌ వంటి టెలికాం సంస్థలు యూజర్ల కోసం పలు బండిల్‌ రీచార్జ్‌ ఆఫర్లను ముందుకుతెచ్చాయి. ఈ రీచార్జ్‌లతో ఓటీటీ సేవలను యూజర్లకు ఉచితంగా అందిస్తున్నాయి. కాగా త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు 50 శాతం మేర పెరిగే అవకాశం ఉండడంతో  ఆయా ఓటీటీ బండిల్‌ రీచార్జ్‌ ప్లాన్లను పలు  టెలికాం సంస్థలు సవరించనున్నట్లు తెలుస్తోంది.ప్రైమ్‌ సబ్‌స్రిప్షన్‌ ధరలు పెరగడంతో పాటుగా....టెలికాం సంస్థలు అందించే ఓటీటీ బండిల్‌ రీచార్జ్‌ ప్లాన్లలో కూడా మార్పులు వస్తాయని అమెజాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: గూగుల్‌లో సూపర్‌ ఫీచర్‌, ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు   

యూజర్లు పక్కదోవ పట్టకుండా..!
జియో రాకతో భారత్‌లో గణనీయమైన మార్పులే వచ్చాయి. కేవలం ఇంటర్నెట్‌ డేటాకు మాత్రమే డబ్బులను చెల్లించాలనే నినాదంతో జియో ముందుకొచ్చింది. దీంతో ఇతర టెలికాం సంస్థలు చేసేదేమీ లేక మొబైల్‌ రీచార్జ్‌ ప్లాన్లను సవరించాయి. ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా తమ యూజర్లు ఇతర నెట్‌వర్క్‌వైపు​ వెళ్లకుండా బండిల్‌ రీచార్జ్‌ ఆఫర్లుతో ముందుకొచ్చాయి. ఇప్పటికే  ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో టెలికాం సంస్థలు యూజర్లకు ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. 
చదవండి: బైక్‌ కొనే వారికి యమహా గుడ్‌న్యూస్‌...!

మరిన్ని వార్తలు