లాభనష్టాల ఊగిసలాట : నష్టాల్లో మార్కెట్‌​

10 Feb, 2021 11:12 IST|Sakshi

సాక్షి, ముంబై:  వరుస  భారీ లాభాల అనంతరం  దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకున్నా..మళ్లీ అదే ధోరణి.  ఇలా లాభనష్టాల మధ్య  ఊగిసలాడుతున్న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లు క్షీణించి 51127 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంత 15053  వద్ద  కొనసాగుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ కూడా అమ్మకాల ఒత్తిడితోభారీగా నష్టపోతోంది.

టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ,  ఎంఅండ్‌ఎం,  ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గ్రాసీం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, గెయిల్‌ లాభాల్లోనూ, అదాని పోర్ట్స్‌ యాక్సిస్‌ బ్యాంక్‌,  టెక్‌ మహీంద్రా,  మారుతీ సుజుకీ  నష్టంతోనూ ట్రేడ్‌ అవుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు