Volkswagen ID.2all EV: ఫోక్స్‌వ్యాగన్ నుంచి రానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇదే.. చూసారా!

18 Mar, 2023 10:45 IST|Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది, ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో మేము సైతం అంటూ ముందుకు దూసుకొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మిన్నకుండిన 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) ఐడీ 2 ఆల్ కాన్సెప్ట్ రూపంలో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఐడీ 2 ఆల్ 2025 నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కేవలం రూ. 22 లక్షల (అంచనా ధర) ధరతో విడుదల కానున్న ఈ సెడాన్ మధ్యతరగతి ప్రజలను ఆకర్శించడానికి సిద్దమవుతున్న నివేదికలు చెబుతున్నాయి.

డిజైన్:

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా ఉండే ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, త్రీడీ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్‌ల మధ్య సమాంతర ఎల్‌ఈడీ స్ట్రిప్ వంటి ఫీచర్లు ఉంటాయి.

(ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?)

ఫీచర్స్:

ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10.9 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే, ట్రావెల్ అసిస్ట్, మెమరీ ఫంక్షన్‌తో పార్క్ అసిస్ట్ ప్లస్, అలాగే మసాజ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి.

బ్యాటరీ ప్యాక్ & రేంజ్:

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ 2 ఆల్ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 450 కిమీ రేంజ్ అందించేలా రూపొందించబడుతోంది. అంతే కాకుండా 2026 నాటికి కంపెనీ దాదాపు పది ఎలక్ట్రిక్ కార్లను విడుదలచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఐడీ 2 ఆల్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ యాక్సిల్ మోటార్ 222 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 20 నిముషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. 11Kw హోమ్ ఛార్జర్‌ కూడా అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు