నిధుల సమీకరణే లక్ష్యంగా..ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయం..!

20 Mar, 2022 21:26 IST|Sakshi

ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర పోరు జరుగుతుంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ అల్లాడిపోతుంది. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ శాయశక్తుల ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెల్‌న్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దం కల్పించారు. అందుకు సంబంధించిన బిల్లుపై జెలెన్‌స్కీ సంతకం చేశారు. 

క్రిప్టో కరెన్సీల చట్టబద్దతపై  ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తమ దేశంలో క్రిప్టో ఎక్స్ఛేంజీలు చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతించబడతాయని పేర్కొంది.దీంతో క్రిప్టో ఖాతాలను జారీ చేయడానికి  బ్యాంకులకు కూడా వెసులుబాటు కలగనుంది.ఇక క్రిప్టో ఆస్తుల మార్కెట్‌ను ఉక్రెయిన్ నేషనల్ కమీషన్ ఆన్ సెక్యూరిటీస్, స్టాక్ మార్కెట్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది.  

రష్యా సైనికచర్యను తిప్పికొట్టే పనిలో భాగంగా నిధుల సేకరణలో  ఉక్రెయిన్‌ బిజీగా ఉంది. అందులో భాగంగా క్రిప్టోకరెన్సీలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు 100 మిలియన్‌ డాలర్లకు పైగా క్రిప్టో విరాళాలను అందుకుంది.ఇదిలా ఉండగా... క్రిప్టో కరెన్సీకి సంబంధించి సెప్టెంబర్ 2021 లో తెరమీదకొచ్చిన ఓ బిల్లు సంస్కరణను జెలెన్స్కీ తిరస్కరించడం గమనార్హం. 

చదవండి: మరో కంపెనీలో భారీగా వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్!

మరిన్ని వార్తలు