అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే!

22 Sep, 2022 07:01 IST|Sakshi

లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్‌ కంపెనీ వోల్వో 2030 నాటికి భారత మార్కెట్లో పూర్తిగా ఎలక్ట్రిక్‌ మోడళ్లనే ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో  దేశీయ మార్కెట్లో లభిస్తున్న అన్ని మోడళ్లను మైల్డ్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌కు మార్చింది.

ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో వోల్వో ఖాతాలో ప్రస్తుతం భారత్‌లో ఎస్‌యూవీ ఎక్స్‌సీ40 రిచార్జ్‌ కొలువుదీరింది. వచ్చే ఏడాది మధ్య కాలంలో పూర్తి ఎలక్ట్రిక్‌ మోడల్‌ మరొకటి రానుంది.

కాగా, 2023 శ్రేణి మైల్డ్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఎక్స్‌సీ40 ఎస్‌యూవీ, ఎస్‌90 సెడాన్, మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఎక్స్‌సీ60, ఎస్‌యూవీ ఎక్స్‌సీ90 కార్లను కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. కొత్త ఫీచర్లను జోడించి వీటికి రూపకల్పన చేసినట్టు వోల్వో కార్‌ ఇండియా ఎండీ మల్హోత్రా తెలిపారు.

  

చదవండి: కొన్ని గంటల్లో ఈ బ్యాంక్‌ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!

మరిన్ని వార్తలు