ప్రపంచవ్యాప్తంగా 4,60,000 కార్లను రీకాల్ చేసిన వోల్వో

5 Oct, 2021 20:49 IST|Sakshi

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ వోల్వో ప్రపంచవ్యాప్తంగా 4,60,000కు పైగా కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్లను రీకాల్ చేసినట్లు వోల్వో తెలిపింది. స్వీడిష్ కార్ల తయారీ సంస్థ ప్రతినిధి యు.ఎస్. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడుతూ.. ఎయిర్ బ్యాగ్స్‌లో చిన్న సాంకేతిక సమస్య వల్ల వాహన చోదకుడీకి, ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రీకాల్ చేసినట్లు తెలిపారు.

ఎన్ హెచ్ టిఎస్ఏకు సమర్పించిన సేఫ్టీ రీకాల్ నివేదికలో వోల్వో ఈ పరిస్థితికి సంబంధించి పూర్తిగా వివరించింది. అయితే, దీని ఫలితంగా మరణం సంభవించిందని తెలిపింది. ఈ లోపం టకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ల భాగాలు రీకాల్ చేశారు. ఇలా వోల్వో మాత్రమే రీకాల్ చేయలేదు, అనేక ఇతర కంపెనీలు కూడా వాటి వాహనాలను చాలా సార్లు వాటి వాహనాలను రీకాల్ చేశాయి.(చదవండి: చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్‌..!)

మరిన్ని వార్తలు