Volvo XC40 Recharge E SUV: ఒకసారి చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు 

28 Jul, 2022 02:50 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్‌ ఇండియా తాజాగా ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.55.9 లక్షలు. ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ కారును బుక్‌ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో అసెంబుల్‌ అయిన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వెల్లడించింది.

78 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం గల 500 కిలోల లిథియం అయాన్‌ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్యాటరీపై ఎనమిదేళ్ల వారంటీ ఉంది. టాప్‌ స్పీడ్‌ గంటకు 180 కిలోమీటర్లు. 4.9 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్‌ వీల్‌ డ్రైవ్, హార్మన్‌ కార్డన్‌ ప్రీమియం సౌండ్‌ సిస్టమ్, క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌తో బ్లైండ్‌ స్పాట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్, పైలట్‌ అసిస్ట్, కొలీషన్‌ మిటిగేషన్‌ సపోర్ట్‌ వంటి హంగులు ఉన్నాయి బుకింగ్‌ కోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు అక్టోబర్‌ నుంచి మొదలవుతాయి. 

మరిన్ని వార్తలు