వేర్‌హౌస్‌ స్పేస్‌కు డిమాండ్‌

4 Sep, 2021 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ–కామర్స్, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ (3 పీఎల్‌) శరవేగంగా విస్తరిస్తుండటంతో గిడ్డంగులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ ఏడాది జనవరి–జూన్‌ (హెచ్‌1) నాటికి హైదరాబాద్‌లో 2.1 కోట్ల చ.అ. వేర్‌హౌస్‌ స్టాక్‌ ఉందని సీబీఆర్‌ఈ సౌత్‌ ఆసియా తెలిపింది. 

ఇందులో 43 శాతం వేర్‌హౌస్‌ స్థలాన్ని రిటైల్‌ సంస్థలు, 19 శాతం 3 పీఎల్, 15 శాతం ఈ–కామర్స్‌ కంపెనీల వాటాలున్నాయని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అదనంగా 50 లక్షల చ.అ. వేర్‌హౌస్‌ స్పేస్‌ చేరుతుందని అంచనా వేసింది. కొన్ని కంపెనీలు ఫుల్‌ఫిల్మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

 ఈ ఏడాది హెచ్‌1లో నగరంలో గిడ్డంగుల అద్దెలు 5–14 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. 2018–2021 హెచ్‌1 నాటికి నగరంలో 1.1 కోట్ల చ.అ.లుగా ఉంది. టీఎస్‌ఐపాస్, పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి వంటివి రాష్ట్రంలో గిడ్డంగుల వృద్ధికి ప్రధాన కారణాలని తెలిపింది.   

చదవండి: ఆగస్ట్‌లో రూ.2,150 కోట్ల రుణాలు

మరిన్ని వార్తలు