Cyrus Mistry: నితిన్‌ గడ్కరీ కీలక నిర్ణయం, త్వరలోనే ఆదేశాలు 

7 Sep, 2022 12:37 IST|Sakshi

న్యూఢిల్లీ:  టాటాసన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్ మిస్త్రీ  రోడ్డు ప్రమాదంలో అకాల మరణం నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇకపై కారులో ప్రయాణించే వారందరికీ సీటు బెల్టు ధరించడం తప్పనిసరి చేస్తామన్నారు. సెప్టెంబర్ 4న జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందడమే ఈ నిర్ణయానికి కారణమని గడ్కరీ తెలిపారు.

సైరస్ మిస్త్రీ మరణం తర్వాత,  కారులో వెనుక సీటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఒక​ మీడియా కార్యక్రమంలో  వెల్లడించిన కేంద్రమంత్రి వెనుకసీటులో కూర్చున్నవారికి కూడా  సీటు బెల్ట్ తప్పని సరిగి ధరించాలని వ్యాఖ్యానించారు.  త్వరలోనే వెనుకసీట్లో కూర్చున్న వారితో సహా కారులో  ప్రయాణించే అం​దరూ సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేస్తామని చెప్పారు.  సీటుబెల్ట్ ధరించకుంటే సీట్‌బెల్ట్ బీప్ సిస్టమ్ కూడా అమలులో ఉంటుందని  గడ్కరీ తెలిపారు. అంతేకాదు ఈ నిబంధన పాటించిక పోతే జరిమానా కూడా విధించేఅవకాశం ఉందని, దీనికి సంబంధించిన  ఆదేశాలనుమూడు రోజుల్లో  జారీ చేస్తామని కూడా గడ్కరీ పేర్కొన్నారు. (పండుగ వేళ ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం, ఫైర్‌ క్రాకర్స్‌ బ్యాన్‌ )

కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  మిస్త్రీ కన్నుమూశారు. మితిమీరిన వేగానికితోడు, వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ సీటు బెల్ట్‌ పెట్టుకోకోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు  ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు