గూగుల్‌లో మరో కొత్త ఫీచర్‌

7 Oct, 2020 13:06 IST|Sakshi

వెబ్‌ స్టోరీస్‌ పేరుతో 'డిస్కవర్‌'లో స్పెషల్‌ స్లైడ్స్‌

ఎప్పటికప్పుడు ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌ 

సాక్షి, ముంబై: సోషల్‌ మీడియా యాప్స్‌ అయినా, వెబ్‌సైట్స్‌ అయినా రోజుకో ఫీచర్‌తో అప్‌డేట్‌ ఇవ్వకపోతే నెటిజన్లను ఆకట్టుకోవడం కష్టం. అందుకే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర టాప్‌ యాప్స్ తమ హోమ్‌ పేజ్‌ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా మార్పులు చేస్తుంటాయి. ఇటీవల కాలంలో ఎక్కువ యాప్స్‌లో వచ్చిన కొత్త ఆప్షన్‌ 'స్టోరీస్‌'. స్టేటస్‌ పేరుతో వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను ప్రారంభించగా.. అదే పేరుతో ఫేస్‌బుక్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది. 'స్టోరీస్‌' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో, మరో పేరుతో యూట్యూబ్‌లో కూడా ఇటువంటి ఫీచరే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు గూగుల్‌ కూడా 'వెబ్‌ స్టోరీస్‌' పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతానికి భారత్‌తోపాటు అమెరికా, బ్రెజిల్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్నా.. దశలవారీగా అన్ని దేశాల్లోనూ ప్రారంభిస్తామని గూగుల్‌ వెల్లడించింది. (చదవండి: గూగుల్‌తో పేటీఎం ఢీ..!)

గూగుల్‌ 'వెబ్‌ స్టోరీస్‌'లో ఇదీ స్పెషల్‌..
మిగతా యాప్స్‌లో మాదిరిగానే గూగుల్‌ వెబ్‌ స్టోరీస్‌ కూడా ప్రత్యేక సెక్షన్‌లో కనిపిస్తాయి. 'గూగుల్‌ డిస్కవర్‌' మెనూ క్లిక్‌ చేస్తే ఫుల్‌ స్క్రీన్‌లో ప్లే అవుతాయి. స్వైప్‌ చేస్తే నెక్స్ట్ స్టోరీ కనిపిస్తుంది. ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, యూఆర్‌ఎల్‌ లింక్స్‌ను ఈ వెబ్‌ స్టోరీస్‌ సెక్షన్‌లో యాడ్‌ చేసుకోవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది. ప్రారంభ దశలో ఉన్న ఈ వెబ్‌ స్టోరీస్‌ సెక్షన్‌ను ప్రస్తుతానికి 2000 వెబ్‌సైట్లే వినియోగించుకుంటున్నాయని గూగుల్‌ ప్రకటించింది.
(చదవండి: గేమింగ్‌ కేసుపై గూగుల్‌ లెన్స్‌!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు