What is 5G?: 5జీ అంటే ఏమిటి? ఈ నెట్‌ వర్క్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

5 Aug, 2022 16:32 IST|Sakshi

అవసరాలకు అనుగణంగా టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తుంది. అందులో భాగమే ఈ ఐదవ జనరేషన్‌ నెట్‌ వర్క్‌. గతంలో మొబైల్‌ నెట్‌ వర్క్‌ కోసం 2జీ నెట్‌ వర్క్‌ ఉండేది. దానితో ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చాలా సమయమే పట్టేది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచుతూ 3జీ వచ్చింది. ప్రస్తుతం 4జీ నెట్‌ వర్క్‌లను వినియోగిస్తున్నాం. ఇందులో 10 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే త్వరలో రాబోతున్న 5జీ నెట్‌ వర్క్‌ 4జీ కంటే 10రెట్ల వేగంగా పనిచేస్తుంది. దీని వేగం కనీసం 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ వరకు ఉండనుంది. గరిష్టంగా 10 జీబీపీఎస్‌ ఉండొచ్చని అంచనా. ఇక 5జీ వేగానికి ఉదాహరణ చెప్పాలంటే 3 గంటల నిడివిగల సినిమాను ఒక్క నిమిషంలో డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. అలాంటి ఫాస్టెస్ట్‌ నెట్‌ వర్క్‌ 5జీ నెట్‌ వర్క్‌కు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. 

4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్‌ వర్క్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ..ఇతర టెలికాం సంస‍్థల కంటే ముందుగానే 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది. జియో సైతం ఆగస్ట్‌ 15కి 5జీ సేవల్ని వినియోగంలోకి తేనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 5జీ అంటే ఏమిటి. 

5జీ అంటే ఏమిటి, 4జీకి.. 5జీకి ఉన్న తేడా ఏంటి?
5జీ అంటే ఫిప్త్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌. అంతర్జాతీయ ప్రమాణలతో 4జీ కంటే 10రెట్ల వేగంతో అందుబాటులోకి రానున్న వైర్‌ లెస్‌ నెట్‌ వర్క్‌. 5జీ నెట్‌ వర్క్‌ వేగంతో పాటు అసలు నెట్‌ వర్క్‌ సరిగ్గా లేని ప్రదేశాల్లో సైతం ఉదాహరణకు గంటల డ్యూరేషన్‌ ఉన్న సినిమా వీడియోల్ని 1, లేదా 2 నిమిషాల్లో డౌన్‌ చేసుకోవడం, తక్కువ నెట్‌ వర్క్‌లో సైతం ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ అవ్వడం, వర్క్‌ ఫ్రం హోం లాంటి పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. వీటితో పాటు హై క్వాలిటీ వీడియో గేమ్స్‌ను ఆడే సౌకర్యం కలగనుంది. 

5జీలో రెండు నెట్‌ వర్క్‌లు 
5జీలో రెండు రకాలైన నెట్‌వర్క్‌లున్నాయి. అందులో ఒకటి 'ఎంఎంవేవ్‌' (mm Wave). నెట్‌ వర్క్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న నెట్‌ వర్క్‌తో ఆన్‌లైన్‌లో మనకు కావాల్సిన పనిని సులభంగా,వేగంగా పూర్తి చేసుకోవచ్చు. 

5జీలో రెండో నెట్‌ వర్క్‌ 'సబ్‌-6జీహెచ్‌జెడ్‌'..ఈ నెట్‌ వర్క్‌ స్లోగా ఉంటుంది. కానీ 4జీతో పోలిస్తే కొంచెం బెటర్, ఇందుకోసం నెట్‌వర్క్ కవరేజీ బాగుండాలి.  

వినియోగించేది సబ్‌-6హెచ్‌జెడ్‌ 5జీ నెట్ వర్క్‌నే 
5జీ నెట్‌ వర్క్‌లో ఎంఎం వేవ్‌ కంటే సబ్‌- 6హెచ్‌జెడ్‌ నెట్‌ వర్క్‌ స్లోగా ఉంటుంది. అయినా చాలా దేశాలు సబ్‌ - 6జీ హెచ్‌ జెడ్‌ నెట్‌ వర్క్‌నే వినియోగిస్తున్నాయి. అందుకు కారణం.. ఖర్చు తక్కువ. నెట్‌ వర్క్‌ పోల్స్‌ను దూరం దూరం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్‌ వర్క్‌ 4జీ కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అంతరాయం ఏర్పడితే ఆ సమస్యని త‍్వరగా పరిష్కరించుకోవచ్చు.  
 
ఎంఎం వేవ్‌ 5జీ నెట్‌ వర్క్‌ విస్తరణ ఖర్చు చాలా ఎక్కువ. వాటి నెట్‌ నెట్‌ వర్క్‌ పోల్స్‌ దగ్గర దగ్గరగా.. ఉండాలి. లేదంటే నెట్‌ వర్క్‌ సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా నెట్‌ వర్క్‌ పోల్స్‌ ను ఏర్పాటు చేయడం కష్ట తరం. అందుకే చాలా దేశాలు ఎంఎం వేవ్‌ 5జీ నెట్‌ వర్క్‌ జోలికి వెళ్లవు.   

5జీ బ్యాండ్‌లు అంటే ఏమిటి? 
గత కొన్నేళ్లుగా 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అవుతున్నాయి. ఆ ఫోన్‌ల బ్యాండ్‌ నెంబర్‌లను ప్రకటిస్తున్నాయి.లేటెస్ట్‌గా విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో వాటి తయారీ సంస్థలు సైతం 9 లేదా 12 బ్యాండ్‌లకు సపోర్ట్‌ చేస్తున్నాయి. అయితే ఈ బ్యాండ్‌లు ఏమిటి? వాటి ప్రాముఖ్య ఏమిటి?

5జీ నెట్‌ వర్క్‌ అనే రేంజ్‌ ఆఫ్‌ ఫ్రీక్వెన్సీస్‌తో పనిచేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌గా పిలిచే వీటిని చిన్న చిన్న బ్యాండ్స్‌గా వర్గీకరిస్తారు. అందులో లో బ్యాండ్‌లు (వైడ్‌ కవరేజ్‌,స్లో స్పీడ్‌) - కవరేజీ ఎక్కువగా ఉండి..స్లోగా ప్రారంభమై..స్పీడ్‌గా పనిచేస్తుంది. మిడ్‌ రేంజ్‌ బ్యాండ్‌లు, హై రేంజ్‌ బ్యాండ్‌లు..లిమిటెడ్‌ కవరేజ్‌లో హై స్పీడ్‌గా కనెక్ట్‌ అవుతాయి.  

ఈ 'n78' బ్యాండ్‌ ఎందుకోసం
అయితే ఈ బ్యాండ్‌ల విషయంలో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారులకు అయోమయానికి గురవ్వడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అవగాహన లేకపోయినా సరే.. లో బ్యాండ్‌ ఉన్న ఫోన్‌ల కంటే హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేస్తే 5జీ నెట్‌ వర్క్‌ పనితీరు బాగుంటుందని అనుకుంటాం. వాస్తవానికి అందులో నిజం లేదని టెలికాం నిపుణులు చెబుతున్నారు. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు బ్యాండ్‌ ఎక్కువ చెప్పారని కాకుండా దేశంలో వినియోగంలోకే వచ్చే 'n78' బ్యాండ్‌ ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.

ఎన్ని దేశాల్లో 5జీ అందుబాటులో ఉందో తెలుసా? 
త్వరలో భారత్‌లో 5జీ నెట్‌ వర్క్‌ సేవలు వినియోగంలోకి రానున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే 5జీ నెట్‌ వర్క్‌లను వినియోగిస్తున్నాయి. స్టాటిస్టా లెక్కల ప్రకారం.. చైనాలో 356 నగరాల్లో, అమెరికాలో 296 నగరాల్లో, పిలిపిన్స్‌లో 98 నగరాల్లో, సౌత్‌ కొరియా 85 నగరాల్లో, కెనడా 84నగరాల్లో, స్పెయిన్‌ 71 నగరాల్లో, ఇటలీ 65 నగరాల్లో, జర్మనీ 58 నగరాల్లో, యూకేలో 57 నగరాల్లో, సౌదీ అరేబియాలో 48 నగరాల్లో ఈ 5జీ సేవల్ని వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు