5జీతో క్యాన్సర్‌ సోకుతుందా?.. ఆందోళన రేకెత్తిస్తున్న రిపోర్ట్‌!

31 Aug, 2022 19:31 IST|Sakshi

మనదేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ కంటే పదిరెట్ల వేగంతో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది.ఈ నెట్‌ వర్క్‌ వినియోగంతో ఎన్ని లాభాలు ఉన్నాయో..మానవాళికి ముప్పుకూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

గ్రూప్‌ స్పెషల్‌ మొబైల్‌ అసోసియేషన్‌(జీఎస్‌ఎంఏ) నివేదిక ప్రకారం.. 50 యూరప్‌ దేశాల్లో 34 దేశాల్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తంలో సగానికి పైగా ఉన్న 173 ప్రాంతాల్లోని (రీజియన్‌) 92 ప్రాంతాల్లో టెలికం కంపెనీలు 5జీ నెట్‌ వర్క్‌లను లాంఛ్‌ చేశారు. ఈ నేపథ్యంలో యూరప్‌లో 5జీ కనెక్టివిటీ కారణంగా క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

అయితే 5జీ నెట్‌ వర్క్‌ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే అంశంపై వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూహెచ్ఓ) పరిశోధనల్ని కొనసాగిస్తుంది. ఆ పరిశోధనల ఫలితాల్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయనుంది. అదే సమయంలో భారత్‌లో సైతం 5జీ నెట్‌ వర్క్‌ వినియోగంలోకి రానుంది. అప్పుడే మనదేశంలో సైతం 5జీతో ఆరోగ్యంపై ప్రమాద అంచనాలకు సంబంధించిన రిపోర్ట్‌ వెలువరించే అవకాశం ఉండనుంది.      

2020 నుంచే డబ్ల్యూహెచ్‌ఓ 
2020నుంచి డబ్ల్యూహెచ్‌ఓ 5జీ రేడియో ఫ్రీక్వెన్సీ పరిధిని కవర్ చేస్తూ..ఆ ఫ్రీక్వెన్సీల వల్ల తలెత్తే ప్రమాదాల్ని అంచనా వేయడం ప్రారంభించింది. కొత్త సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందున, 5జీ ఎక్స్‌పోజర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సమీక్షిస్తోంది.  

క్యాన్సర్, సంతానోత్పత్తి ప్రమాదాలు?
5జీ టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే అందోళనలున్నాయి. 2021లో,5జీ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూరోపియన్ పార్లమెంటరీ రీసెర్చ్ సర్వీస్ యొక్క ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్యానెల్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో  450 నుండి 6000 ఎంహెచ్‌జెడ్‌ ఎలక్ట్రో మోటీవ్‌ ఫోర్స్‌తో  గ్లియోమాస్, ఎకౌస్టిక్ న్యూరోమాలకు సంబంధించి మానవుల్లో క్యాన్సర్ కారకమని నిర్ధారించింది. వీటివల్ల పురుషుల సంతానోత్పత్తి, స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపనుంది. గర్భం, నవజాత శిశువుల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు అని" ప్యానెల్ తెలిపింది.

అప్పటి వరకు 5జీని నిలిపివేయాలి
సాంకేతికత అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ప్రజారోగ్య నిపుణులు, పర్యావరణవేత్తలు 5జీ  ప్రమాదాల గురించి ఆయా దేశాల ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. "యూరోపియన్ ఏజెన్సీల ద్వారా 5జీ ఎఫెక్ట్‌పై అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ,  5జీతో  వందశాతం సురక్షితం అని తేలే వరకు ఆ నెట్‌ వర్క్‌లపై ప్రయగాలు, ప్రచారాల్ని నిలిపివేయాలని అని పర్యావరణ న్యాయవాది ఆకాష్ వశిష్ఠ చెప్పారు.

చదవండి👉 5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్‌’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం!

మరిన్ని వార్తలు