సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే! 

6 Feb, 2021 15:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 90వ దశాబ్ధం వరకు సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనే లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. 45–55 ఏళ్ల వయసు గల వాళ్లే గృహ కొనుగోలుదారులుగా ఉండేవాళ్లు. బ్యాంక్‌ రుణాలపై అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. 20వ దశాబ్ధం నుంచి గృహ కొనుగోలుదారుల వయసు 35–45 ఏళ్లకు తగ్గిపోయింది. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్నాయి. 

చదవండి:

బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ

కొత్త ఎడిషన్‌ కార్లు : వారికి మాత్రమే

బంగారం కొనే వారికి గుడ్‏న్యూస్

మరిన్ని వార్తలు