ఓపెన్‌ఏఐలో ఆల్ట్‌మన్‌ ఉద్యోగం ఊడింది..ఇందుకేనా?

24 Nov, 2023 12:27 IST|Sakshi

టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు కథ సుఖాంతమైంది. ఆయన తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా వస్తున్నట్టు బోర్డు తెలిపింది. అలాగే బోర్డులో కొత్త సభ్యుల నియామకంపై సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. అయితే ఈ తరుణంలో శామ్‌ ఆల్ట్‌మన్‌ని ఓపెన్‌ఏఐని నుంచి తొలగించిన కారణాల్ని వివరిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
 
ఓపెన్‌ఏఐ నుంచి ఆల్ట్‌మన్‌ని ఫైరింగ్‌ ఏపిసోడ్‌ తర్వాత.. ఓపెన్‌ ఏఐలోని రీసెర్చర్ల బృందం ప్రాజెక్ట్‌ క్యూ (క్యూ-స్టార్‌) గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బోర్డ్‌కు ఓ లెటర్‌ను రాశారు. ఆ లెటర్‌ ఆధారంగా రాయిటర్స్‌ ఓ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. 

ప్రాజెక్ట్‌ క్యూ (What is Project Q) అంటే ఏమిటి?
శామ్‌ ఆల్ట్‌మన్‌ ఈ ఏడాది ప్రారంభంలో ఓపెన్‌ఏఐ కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌( ఏజీఐ) గురించి ప్రస్తావించారు. ప్రాజెక్ట్‌ క్యూస్టార్‌ పేరుతో చాట్‌జీపీటీ తర్వాత ఓపెన్‌ఏఐ ఏజీఐ అనే టెక్నాలజీ మీద పనిచేస్తుందని, ఈ సాంకేతిక మనుషుల కంటే స్మార్ట్‌గా పనిచేస్తుందని వివరించారు. 

అంతేకాదు ఏజీఐ విజయవంతంగా ఎలా తయారు చేయగలిగారు? ఈ లేటెస్ట్‌ టెక్నాలజీ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఆర్ధికంగా ఎలాంటి పురోగతి సాధిస్తారు? వంటి విషయాల్ని ప్రస్తావించారు. అదే సమయంలో దాని వల్ల సమాజానికి, మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలిపారు. ఏజీఐని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే తీవ్రమైన అనార్ధాలు, మానవాళి మనుగడకు ముప్పు వంటి అంశాలపై బహిర్ఘతంగా మాట్లాడారు. 

ఏజీఐ చాలా గొప్పది
‘ఏజీఐ చాలా గొప్పది. సమాజంలో జరిగే అభివృద్దిని అడ్డుకుంటుందని, లేదంటే అడ్డుకోవాలని ఏజీఐ కోరుకుంటుందని నేను నమ్మడం లేదు. బదులుగా, యూజర్లు ఏజీఐని ఎలా సమర్ధవంతంగా వినియోగించుకోవాలి..తద్వారా ఎలాంటి ప్రయోజనాల్ని పొందవచ్చనే అంశాన్ని దాని డెవలపర్‌లు గుర్తించాలి’ అని ఆల్ట్‌మన్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

చర్చాంశనీయంగా అల్ట్‌మన్‌ తొలగింపు
ఈ ఏజీఐ ప్రాజెక్ట్‌ వల్ల జరిగే ప్రమాదాల గురించి ఆల్ట్‌మన్‌ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని బోర్డ్‌ సభ్యులకు నచ్చలేదని తెలుస్తోంది. కాబట్టే ఓపెన్ఏఐ నుంచి శామ్‌ ఆల్ట్‌మన్‌ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు హైలెట్‌ చేశారు. కాగా  ఏజీఐ టెక్నాలజీ వల్ల జరిగే అనార్ధాల గురించి దాని డెవలపర్లు రాసిన లెటర్‌ బోర్డ్‌ సభ్యులకు చేరకముందే.. ఆల్ట్‌మన్‌కి పింక్‌ స్లిప్‌ ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది.  

మరిన్ని వార్తలు